Wednesday, August 11, 2010

Janda pai kapi raaju

జెండా పై కపిరాజు, ముందు శిత వాజి శ్రేణియుం పూంచి
నే దండంబును గొని తోలు సెందనము మీదన్
నారి సారించుచున్ గాండీవము ధరించి ఫల్ఘునుడున్ మూకన్ చెండు చున్నప్పుడు
ఒక్కండును ఒక్కండును నీ మొర ఆలకింపడు !
కురుక్షామనాధ సంధింపగన్!
ఒక్కండును ఒక్కండును నీ మొర ఆలకింపడు
!

Baava, eppudu vachcheetuvu ?

బావ! ఎప్పుడు వచ్చీతువు ? సుఖులే భ్రాతల్, సుతుల్, చుట్టముల్ ?
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడు ను ? మన్నీలున్ సుఖోపేతులే ?
నీ వంశోన్నతి కోరు భీష్ముడును ? మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ ?
సేమంబై యోసంగుదురే ? నీ తేజంబు హేచ్చించున్ ! బావ?

Baava ekkada nundi raaka itaku?

బావ! ఎక్కడ నుండి రాక ఇటకు, ఎల్లరులున్ సుఖులే కదా?
ఎసోభాఖులు నీదు అన్నలున్, భవ్య మనస్కులు నీదు తమ్ములను చక్కగనున్నవారే ?
భుజసాలి వృకోదరుడు అగ్రజాగ్య్నకున్ దక్కగా నిల్చి
శాంతు గతి తానూ చరించునే తెలుపుము అర్జునా, ఎక్కడి నుండి రాక?

Sisurvethi Pasurvethi Vethi Gaanarasam Phanihi

శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గానరసం ఫణిః
కో వేత్తి కవితా తత్త్వం
శివో జానాతి వా నవా

Wednesday, February 10, 2010

Srutilayalu - Kori Vachchithi nayya

కోరి వచ్చితి నయ్యా, కోదండపాణి !
కోరి వచ్చితి నయ్యా, కోదండపాణి , కూరిమి తో కరుణించే దొరవని,
కూరిమి తో కరుణించే దొరవని, కరములు మొడిచి అరుదగు వరమును, కోరి వచ్చితి నయ్యా !

ఆణి ముత్యము లాటి, రమణి రత్నము తోటి, పాణి గ్రహణమే కోటి సిరులకు సాటి
కామితార్థము తీర్చ కొమరిత నియ్యమని, కరములు మొడిచి అరుదగు వరమును, కోదండపాణి, కోరి వచ్చితి నయ్యా !

Maya Bazaar - Ghatodgaja's introduction

అష్ట దిక్ కుంభి కుంభాగ్రాల పై మన సుంభ ధ్వజముగ్రాల చూడ వలదే
గగన పాతాళ లోకాల లోని సమస్త భూత కోటులు నాకే మ్రొక్క వలదే
ఏ దేశ మైన నా ఆదేశ ముద్ర పడి సంభ్రామాశ్చర్యాల జరుగ వలదే
హాయ్ హాయ్ ఘటోత్కచ , జై హే ఘటోత్కచ అని దేవ గురుడే కొండాడ వలదే

ఏ నే ఈ ఉర్వి నెల్ల శాసించ వలదే
ఏ నే ఐస్వర్యమెల్ల సాధించ వలదే
ఏ నే మన బంధు హితులకు ఘనతలన్ని కట్ట పెట్టిన ఘన కీర్తి కొట్ట వలదే