Monday, December 2, 2013

United Telugu by Garikapati Narasimha Rao

విడదీయ గానౌనే వేయేండ్ల పద్య సుగంధము నన్నయ్య బంధమిపుడు
పంచి ఇయ్యగా నౌనే పసులకాపరికైన పాడ నేర్పిన మన భాగవతము
పగుల గొట్టగ నౌనే  భండnaమున భద్ర కాళిక రుద్రమ్మ కత్తి ఢాలు
పాయ చీల్చి గ నౌనే బంగారు తోటలో ఘంటసాల గా పారు గాన ఝరిని
ప్రాంతములు వేరు పడినను బాధ లేదు, స్వాంతములు వేరు పడకున్నచాలును  అదియే
తెలుగు విడి పోదు, చెడి పోదు తెలుగు వెలుగు
తెలుగు విడి పోదు, చెడి పోదు తెలుగు వెలుగు
రెండు కన్నులతో ఇక నుండి వెలుగు