Wednesday, August 11, 2010

Janda pai kapi raaju

జెండా పై కపిరాజు, ముందు శిత వాజి శ్రేణియుం పూంచి
నే దండంబును గొని తోలు సెందనము మీదన్
నారి సారించుచున్ గాండీవము ధరించి ఫల్ఘునుడున్ మూకన్ చెండు చున్నప్పుడు
ఒక్కండును ఒక్కండును నీ మొర ఆలకింపడు !
కురుక్షామనాధ సంధింపగన్!
ఒక్కండును ఒక్కండును నీ మొర ఆలకింపడు
!

Baava, eppudu vachcheetuvu ?

బావ! ఎప్పుడు వచ్చీతువు ? సుఖులే భ్రాతల్, సుతుల్, చుట్టముల్ ?
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడు ను ? మన్నీలున్ సుఖోపేతులే ?
నీ వంశోన్నతి కోరు భీష్ముడును ? మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ ?
సేమంబై యోసంగుదురే ? నీ తేజంబు హేచ్చించున్ ! బావ?

Baava ekkada nundi raaka itaku?

బావ! ఎక్కడ నుండి రాక ఇటకు, ఎల్లరులున్ సుఖులే కదా?
ఎసోభాఖులు నీదు అన్నలున్, భవ్య మనస్కులు నీదు తమ్ములను చక్కగనున్నవారే ?
భుజసాలి వృకోదరుడు అగ్రజాగ్య్నకున్ దక్కగా నిల్చి
శాంతు గతి తానూ చరించునే తెలుపుము అర్జునా, ఎక్కడి నుండి రాక?

Sisurvethi Pasurvethi Vethi Gaanarasam Phanihi

శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గానరసం ఫణిః
కో వేత్తి కవితా తత్త్వం
శివో జానాతి వా నవా