Thursday, January 6, 2022

రంగారు బంగారు చెంగావులు ధరించు

 

రంగారు బంగారు చెంగావులు ధరించు
శృంగారతి నారచీర లూనె
భూజనంబులు మెచ్చు భోజనంబులొనర్చు
కమలాక్షి కందమూలములు నమలె 
చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు 
జవ్వని మునిపర్ణ శాల నుండె 
మరులుతో శ్రీరామునురముపై బవళించు 
బాలికామణి యొంటి పవ్వళించె

కన్నుసన్నల శుద్దాంతకాంత లాచరించు 
సేవలు మెచ్చని కాంచనాంగి యొగ్గె  
ముని ముగ్ధ కాంత కృతోపచార 
విధికి నెంచన సాధ్యంబు విధికి గలదె


The lady who wore only the finest crimson gold garments is reduced to tattered linens.
The Lotus eyed hostess who would shower luscious feasts on large populi, has to satiate with lily yams.
The diva who lived in moon lit chandelier palaces has to now live in monastic hermitages.
The ladylove who would doze with desire on Rama's chest, has to now sleep detached.
The queen who would only be pleased by the servitude of the finest court palatial damsels, has to bow down to the duties of a hermitage woman.
What absurdity can destiny not make possible?!

Monday, December 2, 2013

United Telugu by Garikapati Narasimha Rao

విడదీయ గానౌనే వేయేండ్ల పద్య సుగంధము నన్నయ్య బంధమిపుడు
పంచి ఇయ్యగా నౌనే పసులకాపరికైన పాడ నేర్పిన మన భాగవతము
పగుల గొట్టగ నౌనే  భండnaమున భద్ర కాళిక రుద్రమ్మ కత్తి ఢాలు
పాయ చీల్చి గ నౌనే బంగారు తోటలో ఘంటసాల గా పారు గాన ఝరిని
ప్రాంతములు వేరు పడినను బాధ లేదు, స్వాంతములు వేరు పడకున్నచాలును  అదియే
తెలుగు విడి పోదు, చెడి పోదు తెలుగు వెలుగు
తెలుగు విడి పోదు, చెడి పోదు తెలుగు వెలుగు
రెండు కన్నులతో ఇక నుండి వెలుగు

Wednesday, July 10, 2013

Thiramai Sampadalella from Satya Harischandra

ఆలు బిడ్డలును కన్నతల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారు తుదిన్ 
వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము
తిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగి రావు
ఏరికిన్ ఏసరికి యేపాటు విధించెనో విధి
అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు ?
ఉన్నవాడనని గర్వo మేరికిన్ కాదు!
కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కాలానుకూలంబుగా!

Wednesday, August 11, 2010

Janda pai kapi raaju

జెండా పై కపిరాజు, ముందు శిత వాజి శ్రేణియుం పూంచి
నే దండంబును గొని తోలు సెందనము మీదన్
నారి సారించుచున్ గాండీవము ధరించి ఫల్ఘునుడున్ మూకన్ చెండు చున్నప్పుడు
ఒక్కండును ఒక్కండును నీ మొర ఆలకింపడు !
కురుక్షామనాధ సంధింపగన్!
ఒక్కండును ఒక్కండును నీ మొర ఆలకింపడు
!

Baava, eppudu vachcheetuvu ?

బావ! ఎప్పుడు వచ్చీతువు ? సుఖులే భ్రాతల్, సుతుల్, చుట్టముల్ ?
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడు ను ? మన్నీలున్ సుఖోపేతులే ?
నీ వంశోన్నతి కోరు భీష్ముడును ? మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ ?
సేమంబై యోసంగుదురే ? నీ తేజంబు హేచ్చించున్ ! బావ?

Baava ekkada nundi raaka itaku?

బావ! ఎక్కడ నుండి రాక ఇటకు, ఎల్లరులున్ సుఖులే కదా?
ఎసోభాఖులు నీదు అన్నలున్, భవ్య మనస్కులు నీదు తమ్ములను చక్కగనున్నవారే ?
భుజసాలి వృకోదరుడు అగ్రజాగ్య్నకున్ దక్కగా నిల్చి
శాంతు గతి తానూ చరించునే తెలుపుము అర్జునా, ఎక్కడి నుండి రాక?

Sisurvethi Pasurvethi Vethi Gaanarasam Phanihi

శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గానరసం ఫణిః
కో వేత్తి కవితా తత్త్వం
శివో జానాతి వా నవా