Monday, December 2, 2013

United Telugu by Garikapati Narasimha Rao

విడదీయ గానౌనే వేయేండ్ల పద్య సుగంధము నన్నయ్య బంధమిపుడు
పంచి ఇయ్యగా నౌనే పసులకాపరికైన పాడ నేర్పిన మన భాగవతము
పగుల గొట్టగ నౌనే  భండnaమున భద్ర కాళిక రుద్రమ్మ కత్తి ఢాలు
పాయ చీల్చి గ నౌనే బంగారు తోటలో ఘంటసాల గా పారు గాన ఝరిని
ప్రాంతములు వేరు పడినను బాధ లేదు, స్వాంతములు వేరు పడకున్నచాలును  అదియే
తెలుగు విడి పోదు, చెడి పోదు తెలుగు వెలుగు
తెలుగు విడి పోదు, చెడి పోదు తెలుగు వెలుగు
రెండు కన్నులతో ఇక నుండి వెలుగు

Wednesday, July 10, 2013

Thiramai Sampadalella from Satya Harischandra

ఆలు బిడ్డలును కన్నతల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారు తుదిన్ 
వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము
తిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగి రావు
ఏరికిన్ ఏసరికి యేపాటు విధించెనో విధి
అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు ?
ఉన్నవాడనని గర్వo మేరికిన్ కాదు!
కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కాలానుకూలంబుగా!